ఆరోగ్యం


ఆరోగ్యము : (Health) ఓ నానుడి : ఆరోగ్యమే మహాభాగ్యము
మనిషి - శారీరకంగాను, మానసికంగాను, సామజికంగాను, ఆర్దికంగాను, తను ఉన్న పరిసరాలలో హాయిగా జీవించడాన్ని ఆరోగ్యము అందురు . ఆరోగ్యము మనిషి ప్రాధమిక హక్కు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యముగా ఉండాలి , ఆరోగ్యముగా ఉండడానికి ప్రయత్నించాలి , మంచి ఆరోగ్య పరిసరాలను కల్పిణ్చుకోవాలి. ఆరోగ్యముగా ఉండమని ఇతరులకు సలహా ఇవ్వాలి .
ఆరోగ్యవంతుడి శారీరక లక్షణాలు
  • బరువు (వయస్సు ప్రకారం) :
  • శారీరక ఉష్ణోగ్రత :
  • గుండె లయ (హార్ట్ బీట్) :
  • నాడీ లయ (పల్స్ రేట్) :
  • రక్తపోటు (బ్లడ్ ప్రెషర్) :
  • మూల జీవక్రియ రేటు (బేసల్ మెటబాలిక్ రేటు) 

    పౌష్టికాహారం

    • పౌష్టికాహారం :
    • సమతుల్యాహారం :
    • శారీరక వ్యాయామం :
    • మానసిక వ్యాయామం :
    • ధ్యానం :

    • ఆయుర్వేదం
    • పౌరాణిక గాథలు

      వేదముల వలెనే ఇది మొదట బ్రహ్మచే స్వయంగా తెలుసుకొనబడినదని అంటారు. తర్వాత బ్రహ్మ నుండి దక్షప్రజాపతి, అతని నుండి అశ్వినీ దేవతలు, వారి నుండి ఇంద్రుడు ఆయుర్వేదమును నేర్చుకొనిరి అన్నది పురాణ వాక్యం. ధర్మార్థ కామ మోక్షములకు అడ్డంకిగా ఉన్న అనేక వ్యాధులను నయం చేయాలన్న సదుద్దేశంతో భరద్వాజ, ఆత్రేయ, కశ్యప, కాశ్యప, నిమి మొదలగు ఋషులు జనుల యందు దయ కలవారై, త్రిలోకాధిపతియైన ఇంద్రుని వేడిరి. అప్పుడు కాయ, బాల, గ్రహ, ఊర్థ్వాంగ (శాలక్య), శల్య, దంష్ట్ర, జరా, వృష అను 8 విభాగాలతో కూడిన ఆయుర్వేదమును ఆ ఋషులకు ఇంద్రుడు ఉపదేశించెను. ఆ ఋషులు పరమానందముతో భూలోకమునకు వచ్చి శిష్యులకు ఉపదేశించిరి. ఆ శిష్యులలో ఉత్తముడైన అగ్నివేశుడు మొదటిగా అగ్నివేశ తంత్రము అనే గ్రంథమును రచించి విశ్వవ్యాప్తినొందించెను. ఈ విధంగా ఆయుర్వేద అవతరణ జరిగినది. నేటికిని ఈ ఆయుర్వేదము చక్కగ అభ్యసింపబడి ఆచరణలో ఉన్నది.