షడ్రుచులు


Post Rss

Wednesday, November 10, 2010

మీ బ్లాగు టపాలో అందమైన స్మైలీలు కావాలా???

మీరు గమనించే ఉంటారు. ఈ మధ్య కొన్ని బ్లాగుల్లో అందమైన బుల్లి స్మైలీలు కనపడుతున్నాయి. మరి మీ బ్లాగు టపాల్లో కూడా అలా కావాలనుకుంటున్నారా? ఐతే సరే .. ఇలా కొన్ని మార్పులు చేయండి..

ఇక్కడో తిరకాసు ఉంది. ఈ స్మైలీలు మంటనక్క వాడేవాళ్లకు మాత్రమే అందుబాటులో ఉంది. మిగతా బ్రౌజర్లలో కూడా ప్రయత్నించి తర్వాత చెప్తాను.

1. ముందుగా మీరు Firefox బ్రౌజర్ ఓపన్ చేసి Grease Monkey అనే add-on ఇన్స్టాల్ చేసుకోండి. బ్రౌజర్ రీస్టార్ట్ చేయండి.

2.తర్వాత ఈ javascript ఫైల్ ఇన్స్టాల్ చేసుకోండి.

3. ఇప్పుడు మీరు Design విభాగంలోకి వెళ్లి Edit Html కి వెళ్లండి. ఇక్కడ మీరు మీ బ్లాగుయొక్క పూర్తి Html కోడ్ కనిపిస్తుంది . ఇక్కడ మీరు ]]></b:skin> కోడ్ వెతకండి.తొందరగా దొరకట్లేదు. అస్సలేమీ అర్ధం కావట్లేదు అంటారా?? ఒక సులువైన మార్గం చెప్తాను. Edit Html వెళ్లాక Ctrl F నొక్కండి. మీకు సెర్చ్ బాక్స్ వస్తుంది. అందులో పైన చెప్పిన కోడ్ కాపీ పేస్ట్ చేయండి. వెంటనే మీకు అది కనిపిస్తుంది.

4. ఇప్పుడు ఈ క్రింది CSS code ని ఇంతకు ముందు చెప్పిన కోడ్ ( ]]></b:skin> ) పైన పేస్ట్ చేసి సేవ్ చేయండి.

img.emoticon {
padding: 0;
margin: 0;
border: 0;
}

5. అంతే మీ బ్లాగులో ఎన్నో అందమైన స్మైలీలు పెట్టుకునే సులువైన సదుపాయం కల్పించబడింది. కొత్త పోస్ట్ రాసేటప్పుడు, పాత పోస్టు మార్పులు చేసేటప్పుడు ఇలా బాక్స్ కనిపిస్తుంది. మీకు కావలసిన స్మైలీ చేర్చుకోండి.



మరో విధానం కూడా ఉంది.
ఇందాకటి లాగే Design > Edit Html కి వెళ్లండి. అక్కడ Ctrl F తో సెర్చ్ బాక్స్ తెచ్చుకుని head వెతకండి. దానిపైన ఈ కోడ్ పేస్ట్ చేసి సేవ్ చేయండి. అంతే మీ బ్లాగు టపాలో కూల్ కూల్ స్మైలీస్ వస్తాయి..

Thursday, October 7, 2010

screenshot/తెరపట్టు

నెట్ మీద పని చేస్తున్నపుడు మీకు ఏదైనా మ్యాటర్ కాని చిత్రం కాని నచ్చుతుంది.లేదా అవసరమవుతుంది.అది మీ సిస్టం లో సేవ్ చేసుకోవాలంటే ఎలా?. లేదా మీకు కంప్యూటర్ వాడకంలో వచ్చిన సమస్య ఎవరికైనాచెప్పాలి, చూపించాలి అంటే యిపుడు? వీటన్నింటికి సులువైన సమాధానం screenshot లేదా తెరపట్టు.మీకు కావలసిన అంశాన్ని అలాగే చిత్రంలా మార్చిప్ సేవ్ చేసుకోవచ్చు. ఎలాగో చూద్దాం..

మీ కీబోర్డ్ లో కుడివైపు అన్నిటికంటే పైన ఉన్న లైన్లో చూడండి. F కీస్ పక్కన printscreen అనే కీఉంటుంది. మీకు కావలసిన పేజికి వెళ్ళి ఆ కీ ని నొక్కండి. అపుడు ఆ పేజి ఒక ఇమేజ్ లా సేవ్అయిందన్నమాట.






యిపుడు start మెనూలో paint ఓపన్ చేసి అక్కడ మౌసే రైట్ క్లిక్ చేసి పేస్ట్ చేయండి.ఇంతకు ముందు మీరు screenshot తీసుకున్నా చిత్రం అక్కడ ప్రత్యక్షమవుతుంది. దానికి ఒక పేరు ఇచ్చి సేవ్ చేసుకోండి.


మళ్ళీ ఆ చిత్రాన్ని మైక్రోసాఫ్ట్ పిక్చర్ మేనేజర్ లో ఓపన్ చేసి అనవసరమైన భాగం కట్ చేసి సేవ్ చేసుకోండి . యిపుడు మీకు కావలసిన చిత్రం తయారుగా ఉంది. ఒక్క విషయం ఎపుడు కూడా jpeg లేదా png లో సేవ్ చేసుకోండి.




యిపుడు windows7 లో snipping tool సాయంతో ఇంత కష్టపడకుండా చాల సులువుగా screenshot తీసుకోవచ్చు. start మెనూ నుండి snipping tool సెలెక్ట్ చేసుకుని మీకు కావలసిన మ్యాటర్ లేదా చిత్రాన్ని screenshot తీసుకోండి. మీరు ఆ పేజిలోనే కావలసినంత మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు.



మీరు సెలెక్ట్ చేసుకున్నా భాగాన్ని సేవ్ చేసుకోండి అంతే...

Thursday, September 30, 2010

కొత్త బ్లాగర్లకు సూచనలు

కొత్తగా బ్లాగు మొదలెట్టాలని అనుకున్నారు. మంచిదే. బ్లాగర్ కి వెళ్ళి మీకంటూ ఒక సొంత బ్లాగు మొదలు పెట్టారు. అంతటితో పని పూర్తవ్వలేదుగా.. బ్లాగు రాయాలని నిర్ణయించుకున్నప్పుడు ముందు, తర్వాత కొన్ని విషయాల గురించి తెలుసుకుంటే మంచిది. అవి ఏంటో యిపుడు చూద్దాం..


ముందుగా బ్లాగు మొదలెడుతున్నాం. దానికోసం మంచి శీర్షిక లేదా టైటిల్ ఆలోచించి పెట్టుకోండి. ఎదో ఒకటిపెడితే ఎలా?. మన బ్లాగు అంటే మన సొంతిల్లు లాంటిది. అందమైన ఇంటికి అందమైన పేరు ఉండాలిగా?.బ్లాగు మొదలుపెట్టేటప్పుడు టైటిల్ ఇంగ్లీషులో ఇచ్చినా తర్వాత సెట్టింగ్స్ లో తెలుగులోకి మార్చుకోవచ్చు.తెలుగు బ్లాగు పేరు కూడా తెలుగులోనే ఉంటే బావుంటుంది కదా. అలాగే దానికో అందమైన ట్యాగ్ లైన్ కూడాపెట్టండి. ఇంకా అందంగా ఉంటుంది. మరో విషయం. మీరు బ్లాగు మొదలుపెట్టేటప్పుడు బ్లాగు అడ్రస్ అదేనండిurl కూడా అందరికి మీకు కూడా ఈజీగా గుర్తుండేట్టు, సింపుల్ గా ఉండేట్టు చూసుకోండి.




dashboard నుండి settings Formattingకి వెళ్ళండి. అక్కడ ముందుగా చేయవలసిన ముఖ్యమైన మార్పులు. ప్రతి పేజిలో మూడు నుండి ఐదు పోస్టులు మాత్రమే వచ్చేట్టు చూడండి. ఎక్కువ టపాలు ఉంటే మీ బ్లాగ్ ఓపన్ అవడానికి చాలా టైం తీసుకుంటుంది. తర్వాత మీ పోస్టు ప్రచురించే తేది, సమయం గురించి పైన చెప్పినట్టుగా మార్చుకోండి.



ఇక కొత్త బ్లాగర్లు చేయవలసిన మరో ముఖ్యమైన పని.. కామెంట్లు రాసేవారికి పంటి కింది రాయిలా వచ్చే వర్డ్ వెరిఫికేషన్.
settings > comments విభాగంలో ఈ వర్డ్ వెరిఫికేషన్ కావాలా వద్దా అన్నదగ్గర వద్దు అనండి. అలాగే బ్లాగులో ఎవరైనా కామెంట్ రాయగానే మీకు తెలిసేట్టు మీ మెయిల్ ఐడి ఇవ్వండి. ఒకవేళ మీరు కామెంట్స్ మాడరేషన్ పెట్టుకోవాలనుకుంటే కూడా ఆ విధంగా మార్పు చేసుకోవచ్చు.

ఇక కొత్త బ్లాగర్లకు మరి కొన్ని సూచనలు.

బ్లాగు మొదలుపెట్టినందుకు అభినందనలు. ముందు మీరు ఏయే విషయాలు రాయాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. అలా అని ఒకే విధమైన రాతలు రాయాలని కాదు. మీ బ్లాగు మీ ఇష్టం. ఏదైనా విషయం పై టపా రాయాలంటే ముందు దానికి సరిపోయే విధంగా, అందరిని ఆకట్టుకునే విధంగా ఉండేట్టు టైటిల్ ఎంచుకోండి. తర్వాత మీ టపా రాయండి. వీలయితే దానికో చిత్రం పెట్టండి. మర్చిపోకుండా ప్రతి టపాకు లేబిల్ లేదా వర్గం ఇవ్వండి. తర్వాత మీరు కాని మీ బ్లాగు చదివేవారు కానీ పాట టపాలు చదవాలంటే ఆ వర్గాలు చాలా ఉపయోగపడతాయి. మీరు బ్లాగు మొదలుపెట్టగానే అందరూ పొలోమని వచ్చేయరు కదా. మరి ఎలాగంటారా. ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే... మీ బ్లాగులోనీ టపా రాసి కూర్చోకుండా మిగతా బ్లాగులకు వెళ్ళి టపాలు చదివి మీకు నచ్చితే కామెంట్ పెట్టండి. లేదంటే ఎందుకు నచ్చలేదో చెప్పండి. అలా చేస్తుంటే మీ గురించి పదిమందికి తెలుస్తుంది. మీ గురించి మీరే ఇరుగు పొరుగుకు పరిచయం చేసుకోవాలన్నమాట. మెల్లిగా ఇతర బ్లాగర్లు ఎవరా ఈ కొత్త వ్యక్తి అని మీ పేరు ఉన్న లంకె పట్టుకుని మీ బ్లాగుకు వచ్చి మీరు రాసిన టపా చదువుతారు. అలాగే మీ గురించి కొన్ని విషయాలు మీ ప్రొఫైల్ లో పెట్టండి. మరీ పర్సనల్ విషయాలు చెప్పొద్దు లెండి..

మరి మీరు రాసిన టపా అందరికి తెలియాలంటే ఎలా.. తెలుసుగా బ్లాగు సంకలినులు లేదా ఆగ్రిగేటర్లలో చేరాలి.


కూడలి ---- support@koodali.org
మాలిక -... admin@maalika.org
జల్లెడ --- http://dir.jalleda.com/index.php?show=add&PID=79

హారం --- http://haaram.com/Join.aspx
తెలుగు బ్లాగర్స్ ... http://www.telugubloggers.com/add-blog/

అగ్రిగేటర్స్ వివరాలు తెలుసుకున్నారుగా. మరి మీకు అప్పుడప్పుడు వచ్చే సందేహాలకు సమాధానాల కోసం , బ్లాగులకు, అంతర్జాలంలో తెలుగుకు సంబంధించిన చర్చలకోసం తెలుగు బ్లాగు గుంపులో చేరండి.http://groups.google.co.in/group/telugublog ఎవరో ఒకరు మీకు సమాధానమిస్తారు. సందేహాలు , సమస్యలు తీర్చడానికి ప్రయత్నిస్తారు.

Friday, September 24, 2010

వార్తా పత్రికలలో వ్యాసాలు

వివిధ వార్తా పత్రికలలో ప్రచురించబడిన వ్యాసాలను కాపీ చేసుకుని సేవ్ చేసుకోవాలనుకుంటే కొన్ని సమస్యలున్నాయి. ఎందుకంటే ఆయా పత్రికల వాళ్ళు వాడే ఫాంట్ ,మనం నెట్ లో వాడే యూనికోడ్ వేర్వేరు కాబట్టి. ఆయా పత్రికల ఫాంట్లు దిగుమతి చేసుకుని మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకుంటే మనం సులువుగా ఆ తెలుగు లేదా ఏ భాషైనా చదవడానికి అనువుగా ఉంటుంది.


ఆ పత్రికలోని వ్యాసం కాపీ చేసుకుని మన బ్లాగులో కాని, నోట్ పాడ్ లో కాని సేవ్ చేసుకుంటే ఇలా అర్ధం కాని లిపి కనిపిస్తుంది. పేపర్లో చదివితే తెలుగులాగే ఉంటుంది. మరి ఇలా ఎందుకు అయినదంటారా?.. ఫాంట్ సమస్య.. మరి ఏం చేద్దామంటారు.


మంటనక్క వాడే వాళ్ళ కోసం ఒక చిన్న ట్రిక్కు ఉంది. పద్మ అనే ఆడాన్ దించుకుంటే సరి.




మన కంప్యూటర్లో పద్మ ఉన్నంత కాలం వివిధ తెలుగు వ్యాసాలను సులువుగా కాపీ చేసుకుని బ్లాగులో కాని నోట్ పాడ్ లో కాని సేవ్ చేసుకోవచ్చు. అంతే చాలా ఈజీ కదా.



అలా కాదు మేము మంటనక్క వాడము అంటారా. ఐతే http://uni.medhas.org/ సైట్ కి వెళ్ళి మీకు కావలసిన పత్రికలను యూనికోడ్ లో చదవండి, కావలసిన వ్యాసాలు హాయిగా కాపీ చేసుకుని సేవ్ చేసుకోండి.


ఇక పత్రికలలో వచ్చిన వ్యాసాలు లేదా చిత్రాలను ఎలా సేవ్ చేసుకోవాలంటారా.. epaper లో పత్రికల పేజీలు ఇమేజ్ రూపంలో ఉంటాయి కాబట్టి ఈ ఫాంట్ గొడవ ఉండదు. మరి మనకు కావలసిన వ్యాసాలు ఎలా సేవ్ చేసుకోవాలంటారా. ముందుగా ఆ పత్రికలో మీకంటూ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. తర్వాత ఆ పేపర్ తెరిచి మీకు కావలసిన పేజికి వెళ్ళండి. అందులో మీకు కావలసిన వ్యాసం మీద క్లిక్ చేయండి. ఆ వ్యాసం మాత్రమే విడిగా కొత్త పేజిలో ఓపన్ అవుతుంది. అప్పుడు ఆ పేజి మీద రైట్ క్లిక్ చేసి ఇమేజ్ లా మీ సిస్టంలోకి సేవ్ చేస్కొండి. తర్వాత ఆ చిత్రాన్ని మామూలుగా మెయిల్ చేసుకోవచ్చు. బ్లాగులో కూడా పెట్టుకోవచ్చు. మొదట్లో కాస్త తికమకగా ఉంటుంది. ఒకటి రెండు సార్లు చేస్తే అదే ఈజీ అవుతుంది.

మరో విషయం.. కొన్ని పత్రికలలో మనకు కావలసిన ఆర్టికల్స్ ఇమేజ్ లా కాకుండా పిడిఎఫ్ వెర్షన్ కూడా సేవ్ చేసుకోవచ్చు. కానీ అన్నింటిలో ముందు మన అకౌంట్ క్రియేట్ చేసుకోవడం తప్పనిసరి..

Tuesday, September 14, 2010

మహిళలూ - ఇది మీకోసమే...




కంప్యూటర్, అంతర్జాలం సాంకేతిక నిపుణులకు, రచయితలకు, సాహిత్యాభిలాషులకు మాత్రమేనా. మరి ఇంట్లోఉండే మహిళలకు ఈ అంతర్జాలం ఎలా ఉపయోగపడుతుంది. ఇలా అంటే చాలా చాలా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. ఉద్యోగాలు చేసే మహిళలేకాదు ఇంట్లోఉండే గృహిణులు కూడా అంతర్జాలసాయంతో ఎన్నో నేర్చుకోవచ్చు. కాసింత ఆసక్తి, ఓపిక ఉంటే చాలు. ప్రపంచం మన నట్టింట్లో ఉన్నట్టే అని అర్ధమైపోతుంది.  

మరి ఏమేం నేర్చుకోవచ్చో చూద్దాం.
మీకు గోరింటాకు పెట్టడం, పెట్టించుకోవడం ఇష్టమా? పార్లర్ కి వెళ్లినా. ఎవరితో పెట్టించుకుంటే బోలెడు డబ్బు కావాలి. వివిధరకాలైన గోరింటాకు పద్ధతులు ఇంట్లో ఉండే నేర్చుకుంటే డబ్బు ఆదా, సంతృప్తి లభిస్తుంది.వీడియోలు కూడా ఉన్నాయి..

ఈ సైట్లు చూడండి మీకే అర్ధమవుతుంది.

http://www.mehndistyles.com/

http://www.mehndidesigns.com/

http://www.hennamehndi.in/

http://www.youtube.com/watch?v=IO4RCnf-zD8 



ఫ్యాబ్రిక్ పెయింటింగ్

http://www.paintonfabric.com/freepattern.html

http://www.ethnicpaintings.com/painting-media/fabric-painting.html

http://www.metacafe.com/watch/2587818/fabric_painting/

http://www.youtube.com/watch?v=yu6bkKIVYnE

http://mumbai.olx.in/learn-fabric-painting-mueral-painting-pot-painting-and-canvas-painting-iid-9405231


మీకు కుట్లు, అల్లికలు ఇష్టమా? మంచి డిజైన్లు,కొత్త కొత్త కుట్లు నేర్చుకోవాలని ఉందా? ప్రతిదానికి వందలు పెట్టి పుస్తకాలు కొనాలా? అవసరం లేదు. ఇంటర్నెట్టు ముందు కూర్చుని ఓపిగ్గా వెతకండి. పుస్తకాలలో లేని కుట్లు,అల్లికలు డిజైన్లు దొరుకుతాయి. వీడియోలు కూడా చాలా ఉన్నాయి.

http://sadalas.blogspot.com/2010/01/badla-work-designs.html

http://www.embroiderersguild.com/stitch/projects/shisha/index.html

http://hand-embroidery.blogspot.com/2007/02/mirror-work.html

http://www.youtube.com/results?search_query=embroidery+&aq=f

http://draft.blogger.com/goog_1833059637

http://www.freeneedle.com/


మీకు కార్డులు, వాల్ హ్యాంగింగ్స్ లాంటి క్రాప్ట్స్ ఇష్టమా? కొనేబదులు ఇంట్లోనే చేసుకుంటే బావుంటుంది కదా? ఇంకెందుకు ఆలస్యం.


http://www.craftideas.info/

http://www.allfreecrafts.com/

http://www.craftsolutions.com/

http://www.mycraftbook.com/

http://www.craftideas.info/

http://www.webindia123.com/craft/paint/pot/potpaint.html

http://www.squidoo.com/painting-flower-pot


మీరు అందమైన కొవ్వొత్తులు ఇంట్లోనే తయారు చేయాలనుకుంటున్నారా. ఎలాగంటే...

http://www.pioneerthinking.com/candles.html

http://www.webindia123.com/craft/asp/craft.asp?c_id=258

http://www.youtube.com/watch?v=-IvwqjR8cbY

తంజావూరు పెయింటింగులు వేయడం చాలా కష్టం కదా. అసలు వాటిగురించిన సమగ్ర సమాచారం,వాటిని ఎలా వేయాలో తెలుసుకుందాం. అలాగే గ్లాస్ పెయింటింగ్ గురించి కూడా కనుక్కుందాం..

http://tanjorepaintingsart.blogspot.com/2007/11/method-of-making-thanjavur-paintings.html

http://www.youtube.com/watch?v=iDaDXd69--M

http://www.biggersglasspainting.com/

http://www.webindia123.com/craft/paint/glass/stain.html

http://video.google.com/videoplay?docid=-5277109417775421247#

http://www.ethnicpaintings.com/indian_painting_styles/glass/

ఇక అందరికి ఇష్టమైన వంటల గురించి మనకే తెలియని సైట్లు ఎన్నో ఉన్నాయి. భారతీయ వంటకాలను తెలిపే వివిధ వెబ్ సైట్లు ఇవి.

http://foodworld.redchillies.us/

http://www.sanjeevkapoor.com/

http://www.100topcookingsites.com/

http://www.tarladalal.com/

http://food.sify.com/

http://koodali.org/collections/cookery

ఇవేకాకుండా మీకు కావలసిన సమాచారం గూగులమ్మని అడిగితే వెంటనే ఇచ్చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం మొదలుపెట్టండి మీ శోధన....
 

మినప చెక్కలు - చెక్కలు అనగానే బియ్యంపిండితో చేసేవి అనుకుంటున్నారా?? మినుములతో కూడా రుచికరమైన చెక్కలు చేసుకోవచ్చు. తిరుపతిలో కళ్యాణోత్సవం, వసంతోత్సవం, అభిషేకం లాంటి సేవలు ...
10 hours ago